GST సొమ్ము అంతా ధనవంతుల చేతుల్లోకి వెళ్తుంది: రాహుల్

60చూసినవారు
GST సొమ్ము అంతా ధనవంతుల చేతుల్లోకి వెళ్తుంది: రాహుల్
కేరళలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని పాలక్కాడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ,ప్రస్తుతం రెండు ఇండియాలు ఉన్నాయని, ఒకటి బిలీయనీర్లకు చెందినది, రెండోది పెద్ద సంఖ్యలో దేశంలో నివశిస్తున్న ప్రజలదని అన్నారు. జీఎస్టీ డబ్బంతా ధనవంతుల జేబుల్లోకి వళ్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలోని ప్రజలు ఒకరినొకరు పోట్లాడటమే బీజేపీ అలోచన అని తీవ్రంగా మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్