శ్రీ గంగాదేవి-కాటమరాజులకు బోనాల సమర్పణ

72చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో శ్రీ గంగాదేవి-కాటమరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం అందులో భాగంగా యాదవ కులస్తులు బోనాలు సమర్పించిన అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అర్చకులు గ్రామస్తులు తదితరులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్