ఓటు హక్కు మనుషుల ఆత్మవిశ్వాసాన్ని చాటుతుంది

435చూసినవారు
ఓటు హక్కు మనుషుల ఆత్మవిశ్వాసాన్ని చాటుతుంది
రేగొండ మండలంలోని కొత్తపల్లి గోరి గ్రామంలో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బీఎల్ఓ లు నేత వేంకటేష్ అధ్వర్యంలో గ్రామంలోని ఓటర్ లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువజన నాయకులు ఎస్. విష్ణు యాదవ్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ఓటు హక్కు పొందే విధంగా ఓటుహక్కు విశిష్టతను తెలియజేయాలన్నారు. ఓటు హక్కు మనుషుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని చాటుతుంది అన్నారు. ఓటు హక్కు పొందటం సమాజ బాధ్యతగా గుర్తించాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్