జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగులు, ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.