స్టేషన్ ఘనపూర్: బిఎస్పీ మండల అధ్యక్షుడుగా రాజు

69చూసినవారు
స్టేషన్ ఘనపూర్: బిఎస్పీ మండల అధ్యక్షుడుగా రాజు
బహుజన సమాజ్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు మడిపడక చంద్రశేఖర్ మంగళవారం కోరారు. జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షులుగా తాటికొండ గ్రామానికి చెందిన నారబోయిన రాజుని నియమిస్తూ తీర్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ అధ్యక్షులు ప్రవీణ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్