వరంగల్ లో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

58చూసినవారు
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షం కురిసింది. వడగాలులతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితుల్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన మొదలైంది. సుమారు గంట పాటు చిరుజల్లులు మొదలై ఒక మోస్తరు భారీ వర్షం కురిసింది. గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచాయి. పలుచోట్ల చెట్టకొమ్మలు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్