పాప తల్లిదండ్రుల వివరాలు తెలిస్తే చెప్పండి

1044చూసినవారు
హనుమకొండ జిల్లా ఊరుగొండ వద్ద దొరికిన ఆడ శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వరంగల్ ఎంజీఎం డాక్టర్లు తెలిపారు. ఆదివారం పాప పరిస్థితి ఎలా ఉందని ఎస్సై అశోక్ హాస్పటల్ కి వెళ్లి తెలుసుకున్నారు. శిశువును విడిచి వెళ్లిన విషయమై అంగన్వాడీ టీచర్ విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. పాప తల్లిదండ్రుల వివరాలు తెలిస్తే 8897157403, 8712685228, 87126 85020 నంబర్లలో సంప్రదించాలని ఎస్సై కోరారు.

సంబంధిత పోస్ట్