నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
నీట్- 2024 పరీక్ష ఆదివారం జరుగనుంది. పూర్తిగా ఆఫ్లైన్లో జరుగనున్న పరీక్షకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు
నీట్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంజులా దేవి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5, 445 మంది
విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాలకు ఎన్టీఏ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.