తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎంఎల్సీలపై శనివారం మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలకు బీఆర్ఎస్ భయపడుతుంది. వాస్తవాలు తెలుస్తాయని బీఆర్ఎస్ సభ్యులు సీఎంని మండలిలో మాట్లాడనివ్వడంలేదు. అందుకే మా సీఎం మాట్లాడక ముందే నిరసన పేరుతో గట్టిగా స్లొగన్స్ చేస్తున్నారన్నారు. నిజాలు వినకుండా, తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ సభ్యులు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు.