రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కోసం పోరాడుతామని టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ఉద్ఘాటించారు. శనివారం హనుమకొండ లోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో హనుమకొండ, వరంగల్ జిల్లాల టీయూడబ్ల్యూజేే జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విరాహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ల విషయములో కొందరు చేస్తున్న దుష్ర్పచారాన్ని నమ్మవద్దన్నారు.