హనుమకొండ తేజస్వి స్కూల్ మేనేజ్మెంట్ అత్యుత్సాహం చూపింది. సోమవారం అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. మాల వేసుకున్న స్టూడెంట్ కు యూనిఫామ్ ఉంటేనే స్కూల్ కు రావాలని మేనేజ్మెంట్ హెచ్చరించి, గంటపాటు నిలబెట్టిన పిఈటీ టీచర్ నిలబెట్టింది. ఆపై బలవంతంగా యూనిఫామ్ వెపించడంతో స్కూల్ మేనేజ్మెంట్ తీరుపై అయ్యప్ప భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు.