హన్మకొండ గుడిబండల్ వద్ద స్మార్ట్ సిటీ కింద కోటి రూపాయలతో టైలర్ స్ట్రీట్ వరకు నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణానికి గురువారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని, మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని చెప్పిన ప్రతి హామీ అమలు చేసే తీరుతామన్నారు. డివిజన్ లోని ప్రతి వార్డులో రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ నిర్మాణం చేపడుతామన్నారు.