వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

68చూసినవారు
వరంగల్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జిల్లా అధికారుల సంఘం, టీఎన్జీవోస్, టీజిఓస్ మరియు వివిధ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుండి మహిళ ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొని వచ్చి శాఖల వారీగా కేటాయించిన స్థలాలలో ఉంచి ఉత్సాహంగా పాటలు పాడుతూ ఘనంగా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్