రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

1095చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) ను పురస్కరించుకొని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా చేపట్టే ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, పేదవారికి దానం వంటి కార్యక్రమాలు స్వీయ క్రమశిక్షణను, జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయని మంత్రి అన్నారు. మానవీయ విలువలను రంజాన్ పండుగ పెంపొందిస్తుందని మంత్రి తెలిపారు.