వరంగల్ జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నూతన సంవత్సర డైరీని హనుమకొండ సీపీ రెడ్డి కాంప్లెక్స్ ఫోటో భవన్ లో జిల్లా అధ్యక్షులు జి లింగమూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుల వారితో కార్యనిర్వాహక అధ్యక్షులు సునీల్ కుమార్, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల దయాకర్, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.