హనుమకొండ హంటర్ రోడ్ న్యూ శాయంపేటలో గల దోనె గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ వేద పండితులు వంశీకృష్ణ ఆచార్యులు ఆధ్వర్యంలో సంతోష్ లక్ష్మీ స్వామి పూజా కార్యక్రమాలతో భూదేవి శ్రీదేవి సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.