వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం వర్ధన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని, వర్ధన్నపేట మండలం ఇల్లంద కేజీబీవీను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులతో ముచ్చటించారు. మౌలిక వసతులు, బోజన సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పిల్లలతో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు.