వర్ధన్నపేట నియోజకవర్గం ఇనవోలు మండలంలోని పవిత్ర క్షేత్రం మల్లన్న జాతర ఏర్పాట్లను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మంగళవారం పర్యవేక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నుండి ఉగాది వరకు జరిగే మహా జాతరను ఏర్పాట్లను మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్మెట్ట వెంకటరమణ గౌడ్ పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ గౌడ్, రాజయ్య, రమేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.