వర్ధన్నపేటలో రోడ్డు ప్రమాదం

59చూసినవారు
వర్ధన్నపేటలో రోడ్డు ప్రమాదం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట సమీపంలో దమ్మన్నపేట క్రాస్ రోడ్డు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం వర్ధన్నపేట నుండి జాఫర్ ఘడ్ వెళ్ళేవి మార్గంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్ లో ఎంజీఎం కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్