నయనతార-విగ్నేష్ శివన్ దంపతులు ఆపద కాలంలో మంచు మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయంలో వేల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా నయనతార దంపతులు తమ వంతుగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20 లక్షల విరాళం అందించారు. కేరళకు జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తి చేయలేరంటూ విగ్నేష్ శివన్ ఒక నోట్ విడుదల చేశారు.