మేం ఎప్పుడూ మీతోనే ఉంటాం: మంచు మనోజ్‌

85చూసినవారు
మేం ఎప్పుడూ మీతోనే ఉంటాం: మంచు మనోజ్‌
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హీరో మంచు మనోజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఎన్నికల్లో గేమ్‌ ఛేంజర్‌గా నిలిచిన మా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌గారికి స్పెషల్‌ కంగ్రాట్స్‌. మీ ప్రయాణం అందరికీ స్ఫూర్తి అన్నా. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఇలాంటి విజయాన్ని అందుకోవడం అభినందనీయం. మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. మేం ఎప్పుడూ మీతోనే ఉంటాం’’ అన్నారు.

సంబంధిత పోస్ట్