TG: రాష్ట్రంలో సాగుచేసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని నాయకన్‌గూడెంలో ఆయన గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యం ప్రతి క్వింటాకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు తొందరపడి దళారులకు ధాన్యం అమ్మవద్దని అన్నారు.