త్రిశూలం, అభయముద్రపై లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘శివుడి ఎడమచేతి వెనక త్రిశూలం ఉంటుంది. త్రిశూలం హింసకు చిహ్నం కాదు కనుకే శివుడికి వెనకపైపు ఉంటుంది. హింసకు చిహ్నమైతే శివుడి కుడిచేతిలోనే ఉండేది. చాలామంది ఒక చిహ్నాన్ని వ్యతిరేకిస్తారు. ఆ చిహ్నమే అభయముద్ర.. అదే కాంగ్రెస్ పార్టీ గుర్తు.. భయం లేకుండా జీవించేందుకు అభయముద్ర అవసరం’ అని అన్నారు.