తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

52చూసినవారు
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రధాన సబ్జెక్టులు ఈ నెల 20వ తేదీతో ముగియగా, అన్ని సబ్జెక్టుల పరీక్షలు మంగళవారంతో పూర్తయ్యాయి. ఇక ఇప్పటికే ఆన్సర్ షీట్స్ వాల్యూయేషన్ ప్రారంభమైంది. దీంతో పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 4వ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఏప్రిల్‌ 29వ తేదీ నుంచి ఎప్‌సెట్‌ ప్రారంభం కానుంది. అందువల్ల ఆ పరీక్ష ప్రారంభానికి కనీసం రెండు మూడు రోజుల ముందుగా ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్