స్వలింగ వివాహాలను అధికారికంగా నమోదు చేసిన మొదటి దక్షిణాసియా దేశంగా నేపాల్ నిలిచింది. 2007లోనే స్వలింగ వివాహాలను అనుమతిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 2015లో ఆమోదించిన ఈ దేశ రాజ్యాంగం లైంగిక ధోరణి ఆధారంగా వివక్షను స్పష్టంగా నిషేధిస్తూ సాహసోపేతమైన చర్య తీసుకుంది. ఈ దేశంలోని లామ్‌జంగ్ జిల్లాలోని డోర్డి రూరల్ మున్సిపాలిటీలో మొదటి స్వలింగ వివాహం జరిగింది.