'ఎవరో ఎందుకు.. డబ్బులు బాగా ఇస్తే నా బయోపిక్ లో నేనే నటిస్తా': రాహుల్ ద్రవిడ్

82చూసినవారు
'ఎవరో ఎందుకు.. డబ్బులు బాగా ఇస్తే నా బయోపిక్ లో నేనే నటిస్తా': రాహుల్ ద్రవిడ్
తన బయోపిక్ గురించి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్​లో పాల్గొన్న ద్రవిడ్​కు ఈ మేరకు ఓ ప్రశ్న ఎదురైంది. 'మీ బయోపిక్ లో మీ పాత్రను పోషించేందుకు ఎవరిని ఎంచుకుంటారు?' అని ఆడగగా ద్రవిడ్ సరదాగా సమాధానమిచ్చారు. “ఎవరో ఎందుకు.. డబ్బు బాగా ఇస్తే నా బయోపిక్ లో నా పాత్రలో నేనే నటిస్తా” అని అన్నారు. ఇప్పటికే భారత స్టార్ క్రికెటర్ల జీవిత కథ ఆధారంగా కొన్ని సినిమాలు తెరకెక్కాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్