అసెంబ్లీలో ఫూలే విగ్రహ ఏర్పాటులో జాప్యమెందుకు?: కవిత

75చూసినవారు
అసెంబ్లీలో ఫూలే విగ్రహ ఏర్పాటులో జాప్యమెందుకు?: కవిత
రేవంత్ సర్కార్‌కు బీసీలంటే చిన్నచూపా? అని BRS నేత కవిత ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటులో జాప్యమెందుకని మండిపడ్డారు. శనివారం తన నివాసంలో బీసీ సంఘాల నాయకులతో కలిసి ఫూలే విగ్రహ సాధన దీక్ష పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 8న ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న విగ్రహ సాధన దీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే దీక్ష చేపడుతున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్