భర్త వాట్సాప్ కు భార్య ప్రియుడి మెసేజ్.. కొంప ముంచిన సీక్రెట్ ఎఫైర్!

314744చూసినవారు
భర్త వాట్సాప్ కు భార్య ప్రియుడి మెసేజ్.. కొంప ముంచిన సీక్రెట్ ఎఫైర్!
భర్త, పండంటి బిడ్డ ఉన్నప్పటికీ ఓ మహిళ బుద్ధి గాడి తప్పింది. ప్రియుడితో ఆమె నడిపించిన ఎఫైర్ చివరకు ఆమె ప్రాణం తీసింది. తొలుత భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె చనిపోయిందని భావించనా.. ఆ తర్వాత మాత్రం ఊహించని వ్యవహారం బయటపడింది. కేరళలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గోపిక (29), షెర్లిన్ ఫిలిప్ లు భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. కుటుంబంతో సంతోషంగా ఉండాల్సిన గోపిక బుద్ధి తప్పుదోవ పట్టింది. విష్ణు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అలా ఇద్దరి మధ్య చనువు పెరిగి గత నాలుగేళ్లుగా ఆమె భర్తకు తెలియకుండా ఇద్దరూ సీక్రెట్ అఫైర్ కొనసాగించారు.

ఇదిలా ఉంటే ఇటీవల గోపిక, విష్ణు మధ్య మనస్పర్థలు వచ్చాయి. తన దారి తాను చూసుకుంటానని విష్ణు తెగేసి చెప్పేశాడు. దీంతో గోపిక అలా ఎలా కుదురుతుందని వాదించింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే పెళ్లి చేసుకోబోయేది లేదని విష్ణు చెప్పాడు. ఎక్కువగా మాట్లాడితే మన వ్యవహారం నీ భర్తతో చెప్పేస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా గోపికతో వాట్సాప్ లో సంభాషణలు, సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఆమె భర్తకు పంపించాడు. తన ప్రేమ వ్యవహారం భర్తకు తెలియడంతో మనస్తాపం చెందిన గోపిక ఆత్మహత్యకు సిద్దమైంది.


చివరగా విష్ణుకు వీడియో కాల్ చేసి తాను చనిపోబోతున్నట్లు చెప్పింది. ఉరేసుకుంటున్న దృశ్యాలను చూపించింది. ఆమె చనిపోతే ఆ కేసు తన మీద పడుతుందని కంగారుపడిన విష్ణు అలా చేయవద్దని, తాను వచ్చి మాట్లాడుతానని చెప్పాడు. హుటాహుటిన గోపిక ఇంటికి వెళ్లాడు. కానీ ఆమె అప్పటికే ఉరితాడుకు వేళాడుతూ కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆసుపత్రిలో విష్ణు వ్యవహారంపై సిబ్బందికి అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గోపికతో ఉన్న వివాహేతర సంబంధం గురించి నిజం ఒప్పుకున్నాడు. పోలీసులు విష్ణుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్