వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: కాంగ్రెస్‌

82చూసినవారు
వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: కాంగ్రెస్‌
వక్ఫ్‌ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. వక్ఫ్‌ సవరణ బిల్లును సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తెలిపారు. రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటామని వ్యాఖ్యానించారు. CAA, RTI, ఎన్నికల నియమాలపై గతంలో పోరాటాలు చేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్