ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళ్తా: సీఎం రేవంత్‌

79చూసినవారు
ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళ్తా: సీఎం రేవంత్‌
చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణస్వీకారానికి తప్పకుండా వెళ్తానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అన్నారు. రాహుల్ గాంధీ విస్పష్టంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్