విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను రద్దు చేసిన కేంద్రం

71చూసినవారు
విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను రద్దు చేసిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధిస్తున్న విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను రద్దు చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో రిలయన్స్‌, ఓఎన్‌జీసీలకు భారీ ఊరట లభించినట్లయింది. కాగా, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌), క్రూడ్‌ ఉత్పత్తుల ఎగుమతులపై 2022 జులై 1 నుంచి కేంద్రం విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధిస్తోంది.

సంబంధిత పోస్ట్