యూపీలోని మురాదాబాద్‌లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు కారులోని ఇరుక్కుపోయి మరణించారు. నలుగురు స్నేహితులు కారులో వస్తూ గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయి రాంగ్ రూట్‌లో వచ్చారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రక్కు కారుని ఢీకొట్టింది. దీంతో కారు డోర్ లాక్ అయిపోయి అందులోనే ఇరుక్కుపోయి ఇద్దరు యువతులు మరణించగా మరో ఇద్దరిని పోలీసులు కాపాడారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.