బస్సు ఆపలేదని హైదరాబాద్‌లో ఓ మహిళ కండక్టర్‌పై వృద్ధురాలు పాము విసిరింది. గురువారం దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన బస్సు ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విద్యానగర్ బస్టాప్ దాటిన తర్వాత మహిళ బస్సును ఆపాలని చెయ్యెత్తింది. కాస్త ముందుకు పోనిచ్చిన డ్రైవర్ రోడ్డు పక్కగా ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో బస్సు ఆపలేదన్న కోపంతో మహిళ బస్సు వెనక అద్దంపైకి బీర్ బాటిల్ విసిరింది. మహిళా కండక్టర్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో కండక్టర్‌పై పామును విసిరింది. భయంతో కండక్టర్ పరుగులు తీసింది.