అండర్-19 మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో యువ భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. త్రిష (32), కమలిని (28), మిథిల (17) రాణించారు.