ఆలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం గౌడన్నలకు సేఫ్టీ మోకులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గీత కార్మికుల రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాల కిట్లు గౌడన్నలకు ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదనపు కలెక్టర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.