మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా దేశంలోని వివిధ నది తీర్థములను తెప్పించిన యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు.
నదీ తీర్థములు గోదావరి, పెన్ గంగ, యమున, గంగ, ప్రయాగరాజ్ త్రివేణీ సంగమం (గంగ, యమునా, సరస్వతి), సరయూ, గోమతి, నర్మదా, మంజీర, తాలిపేరు, హరిద్రా, కృష్ణా, తుంగ, భద్ర నదీ తీర్థములను దేశ నలుమూలల నదుల నుంచి తెప్పించి గురువారం యజ్ఞశాల కలశములలో కలిపి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు.