రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు భువనగిరి పట్టణంలో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ రైతు సమన్వయ కమిటీ జిల్లా కార్యదర్శి కోలుపుల అమరేందర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్, చింతల వెంకటేశ్వరరెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు.