మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగులు ఎదురుకుంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఏఐటీయూసీ అనుబంధం) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఎంహెచ్ ఓ డాక్టర్ ఎం మనోహర్ కి వినతిపత్రం సమర్పించిన అనంతరం శాలువాతో సత్కరించి పూల మొక్కను ఇచ్చారు.