ఏకశిఖరవాసుడికి శాస్త్రోక్తంగా నిత్యారాధనలు

65చూసినవారు
ఏకశిఖరవాసుడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి శనివారం నిత్య విధి కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువ జామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్ఠా అలంకార మూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో లక్ష్మీనృసింహుడిని గజవాహన సేవలో తీర్చిదిద్ది సేవోత్సవం చేపట్టి నిత్య తిరుకళ్యాణోత్సవం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్