అక్రమ అరెస్ట్ లను ఖండించాలి

168చూసినవారు
అక్రమ అరెస్ట్ లను ఖండించాలి
భువనగిరిలో ఏఐటీయూసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ త్రీవంగా ఖండించారు. శుక్రవారం రోజున ఆటోరంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ పిలుపులో భాగంగా పోలీసులు ముందస్తుగా ఏఐటీయూసీ నాయకులను అరెస్ట్ చేసి భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులైన ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలని, ఆకాశాన్నంటిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, ఆటో ఫైనాన్సియర్ల వేధింపులు ఆపాలని, ఏపీ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణలో కూడా ఆటోకు రూ. 10 వేలు ఇవ్వాలని, ప్రమాద భీమా రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ లపై ఏఐటీయూసీ చలో అసెంబ్లీకి పిలుపునిస్తే ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేయడం సరైన పద్ధతి కాదని ఆయన ఆరోపించారు. వెంటనే ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనియెడల ఆందోళనలు తీవ్రతరం చేస్తామని తెలిపారు.
ఈ రోజు అరెస్ట్ అయిన వారిలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గనబోయిన వెంకటేష్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, నాయకులు బండి రమేష్, ఎండీ చాంద్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్