యాదాద్రి శ్రీవారికి నిత్య నిజాభిషేకం

81చూసినవారు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి బుధవారం ఉదయం నిత్య నిజాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం పాలు, పెరుగు, పంచదార పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేకం వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ నీరాజనాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్