డివైడర్ ను ఢీకొని ఆటో బోల్తా పడడంతో ఒకరు దుర్మరణం చెందారు. నార్కట్ పల్లి శివారులో శుక్రవారం ఘటన చోటు చేసుకుంది. నార్కట్ పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన దొండ యాదయ్య గోపాలయపల్లి గ్రామానికి వెళ్లి ఆటోలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో నార్కట్ పల్లి శివారులోని లారీ ఆఫీసు వద్ద ఆటో డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న యాదయ్య మృతి చెందాడు.