ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి అమ్మాయిని వేధించాడని నడిరోడ్డుపై సదరు వ్యక్తిని కొందరు దారుణంగా కొట్టారు. కొట్టవద్దని ఎంత వేడుకున్నా వదల్లేదు. అనంతరం అతడిని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి వారికి స్థానికులు తగిన బుద్ధి చెప్పారని అంటున్నారు.