AP: కర్నూలు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. దేవనకొండ మండలం చెల్లెలిచెలిమెల గ్రామానికి చెందిన బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. గ్రామస్తుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.