అనకాపల్లి గవరపాలెంలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు లక్ష్మీ నారాయణమ్మ మెడకు టవల్ బిగించి యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డారు. వృద్ధురాలు ప్రతి ఘటించడంతో ఆమె మెడలోని 8 తులాల గోల్డ్ చైన్ తీసుకుని యువకుడు పారిపోయాడు. ఈ ఘటన అంతా ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. కేబుల్ టీవీలో పని చేసే గోవింద్‌గా పోలీసులు గుర్తించారు. వృద్ధురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.