ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు లైన్ క్లియర్

77చూసినవారు
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు లైన్ క్లియర్
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఐపీఓ ద్వారా రూ.7,250 కోట్ల నిధులు సేకరించాలని సంస్థ భావిస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన షేర్లతో రూ. 5,500కోట్లు, మరో రూ.1,750 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) పద్ధతిలో సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. OFS కింద వాటాదార్లు 95.19 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఓలా ఫౌండర్ భవిష్ అగర్వాల్ 47.3 మిలియన్ షేర్లు విక్రయించేందుకు సిద్ధమయ్యారు.

ట్యాగ్స్ :