![అత్యాచార బాలిక గర్భ విచ్ఛిత్తి తీర్పును వెనక్కి తీసుకున్న సుప్రీంకోర్టు! అత్యాచార బాలిక గర్భ విచ్ఛిత్తి తీర్పును వెనక్కి తీసుకున్న సుప్రీంకోర్టు!](https://media.getlokalapp.com/cache/8f/2e/8f2e042d03f8c63b01f472dcd49e9570.webp)
అత్యాచార బాలిక గర్భ విచ్ఛిత్తి తీర్పును వెనక్కి తీసుకున్న సుప్రీంకోర్టు!
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఇటీవల అనుమతించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ తీర్పును కోర్టు వెనక్కి తీసుకుంటున్నట్లు సోమవారం వెల్లడించింది. గర్భవిచ్ఛిత్తి తర్వాత తమ కుమార్తె ఆరోగ్యం విషయంలో ఆందోళనగా ఉందని బాలిక తల్లిదండ్రులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా.. ఈ ఆదేశాలు చేశారు.