కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కుమారులు
కన్న తల్లిని రోడ్డుపై వదిలేసిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ తల్లిని కుమారులు యర్రగొండపాలెం ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద వదిలేసి వెళ్లారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లి పట్ల కనికరం చూపలేదు. అనాధలా వదిలేసి వెళ్లిపోయారు. అన్నం కూడా తినలేని స్థితిలో ఉన్న ఆమె అష్టకష్టాలు పడుతున్నారు. చలిలో ఉన్న వృద్ధురాలిని అధికారులు స్పందించి ఆశ్రమానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.