కృష్ణా జిల్లా కేడీసీసీబీ బ్యాంకుకు NAFCOB అవార్డు
ఏపీలోని కృష్ణా జిల్లా కేంద్ర బ్యాంకుకు ఉత్తమ అవార్డు లభించింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (NAFCOB) 60 వసంతాల ఉత్సవాల్లో భాగంగా మంచి టర్నోవర్ సాధించిన సహకార కేంద్ర బ్యాంకులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రమంలో ఉత్తమ సేవలతో పాటు రూ.11,300 కోట్ల టర్నోవర్ సాధించిన రెండో బ్యాంకుగా కేడీసీసీబీని గుర్తించి అవార్డు అందజేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా చేతుల మీదుగా అవార్డు అందజేశారు.