బాలయ్య పండుగకి సెలవు కావాలి: సాఫ్ట్వేర్ ఉద్యోగులు
TG: ప్రముఖ హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్స్టాపబుల్-4' కోసం హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు హాలిడే కావాలని గురువారం వినూత్న రీతిలో ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ నెల 25న అన్స్టాపబుల్-4 ఎపిసోడ్-1 చూసేందుకు బాలయ్య పండుగ డిక్లేర్ చేసి హాలిడే ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సైబర్ టవర్స్, మైండ్ స్పేస్, దుర్గం చెరువు వద్ద సాఫ్ట్వేర్ ఆఫీసుల ముందు అభిమానులు ప్లకార్డులను ప్రదర్శించారు.